BHAGAVATA KADHA-3    Chapters   

మహాభారత యుద్ధములో కృష్ణ కృప

58

శ్లో || యద్దోష్షు మా ప్రణిహితం గురు భీష్మ కర్ణ

ద్రౌణి త్రిగర్త శల సైంధవ బాహ్లికాద్యైః

అస్త్రాణ్యమోఘ మహిమాని నిరూపితాని

నోపస్పృశుర్నృ హరిదాస హరిదాస మివాసురాణి ||

భాగ. 1 స్కం. 15 అ. 19. శ్లో.

" మ. గురు భీష్మాదులు గూడి పన్నిన కురుక్షోణీశ చక్రంబులో

గురుశక్తిన్‌ రథయంతయై నొగలపై గూర్చిండి యామేటి నా

శరముల్‌ వాఱక మున్న వారల బలోత్సాహాయురుద్యోగ త

త్పరతల్‌ చూడ్కుల సంహరించు నమితోత్సాహంబు నాకిచ్చుచున్‌."

మ. అసురేంద్రుం డొనరించు కృత్యములు ప్రహ్లాదుం బ్రవేశించే గె

ల్వ సమర్థంబులు గానికైవడిఁ గృపాశ్వత్థామ గాంగేయ సూ

ర్యసుత ద్రోణ ధనుర్విముక్త బహు దివ్యాస్త్ర ప్రపంచంబు నా

దెసకున్‌ రాక తొలంగు మాధవు దయాదృష్టిన్‌ నరేంద్రోత్తమా."

అట్టివాఁడు "మనలను దిగనాడి చనియె మనుజాధీశా!"

---శ్రీమదాంధ్రభాగవతము.

ఛప్పయ

కైసీ కిరపా కరీ హమారే ఊపర రణ మఁహ |

భీష్మ ద్రోమ సమవీర బాణ తకి మారహిఁతన మఁహ ||

జాహిఁ సర్ర కరి నికరి తనిక తన మఁహ నహిఁలాగైఁ |

లగత మేరే బాణ శత్రు రణ తజి సబ భాగైఁ ||

మేరే రథ పై బైఠికేఁ సబకూఁ, నిరబీరజ కర్యో |

దృష్ణి డారి మృత సదృశకరి, ఓ జ, తేజ, వయ బల హర్యో||

అర్థము

శ్రీకృష్ణుఁడు మహాయుద్ధమున మనయందెట్టి కృపఁ జూపెను! భీష్మద్రోణాది మహావీరులు బాణములు వదలు చుండఁగా అవి అన్నియు నాకు తగులకుండునట్లు వమ్ముచేసెను. నాబాణములు తగిలిన శత్రువులు యుద్ధములో నిలువలేక పారిపోయెడు వారు.

శ్రీకృష్ణుఁéడు నారథముపైఁ గూర్చుండి అందఱను నిర్వీర్యులను జేసెను. దృష్టినిసారించి మృతసదృశులఁ గావించెను. ఓజో, బల, తేజములను హరించెను.

-----

శస్త్రమును విధ్యుక్తముగఁబ్రయోగించువాఁడు లేకుండిన నది తానుగాఁజంపఁజాలదు. ఆడించువాఁడు లేనంతవఱకు కొయ్యబొమ్మ ఆడదు - అని యాలోచించుకొని మహాభారత యుద్ధములోఁజూపిన శ్రీకృష్ణ కృపను స్మరించుకొనుచు నర్జునుఁడు మరల కన్నీళ్లు తుడుచుకొని ధైర్యమును వహించి యిట్లనెను :-

"రాజా ! భగవ తుఁడీ భూమి మీఁద నున్నంత వఱకు మనను గనిపెట్టని క్షణము లేదు. విపత్తులనుండి రక్షింపని నిమిషము లేదు. విపత్సాగరమును దాఁటుటకు సహాయపడని సమయము లేదు. కంసుని జంపఁగానే ఆతఁడు వెంటనే మన క్షేమసమాచారములు కనుఁగొని రమ్మని మామయగు నక్రూరుని బంపెను. అప్పటికి మనము తండ్రిలేనివార మైతిమి. అప్పటికి మనము శ్యామసుందరుని యెఱుఁగనేయెఱుఁగము. మన సర్వస్వమీతఁడేనని అప్పుడే గ్రహించితిమి. మన శిరస్సున నాతని వరద హస్తము కలదనియు గ్రహించితిమి.

మహాభారత యుద్ధములో నాతఁడు నిశ్శస్త్రుఁడయ్యు నసంఖ్యాకులగు అస్త్రశస్త్రధారులగు యోధులకు మించిన కార్యము లొనర్చెను. పోరాడక పోయినప్పటికిని యుద్ధములో ముఖ్యపాత్ర ఆతఁడే. కొయ్యబొమ్మ ఆడును. అనేకములగు హావభావములను జూపించును. ఒక మనుష్యఁడచ్చట మెదలక కూర్చుండి ఆశ్చర్య మేమియును లేక నృత్యమును జూచుచుండును. ఇతర దర్శకు లందఱు నీతఁడుకూడ మనవలె దర్శకుఁడను కొందురు. కాని వానిచేయి ఒకటి దాఁగియుండును. ఆ దాఁగిన చేతిలోనే ఆ బొమ్మనాడించు త్రాడుండును. దాని ననుసరించియే అది ఆడును. గతి హీనమగు నాబొమ్మలోనికి గతి యా యుదాసీనునివలెఁ గూర్చుండిన పురుషునివలనఁ గలుగుచున్నది. దర్శకులానిర్జీవ కొయ్యబొమ్మ వివిధములగు హావభావమును జూపి ఆడుచుండుటను గాంచి ఆశ్చర్యపడుచుందురు. వీరాశ్చర్యపడుచుందురుగాని అచ్చట నిశ్చేష్టుఁడుగఁగూర్చిండిన వ్యక్తియే యిది యంతయు నాడించుచున్నాఁడను సంగతియు, ఊరక మంత్రములు పలుకుచున్నాఁడను సంగతి వారికి తెలియదు. ఆ దాఁగిన చేయియే వెంటవెంటనే ఆకౌతుకమును జూపించుచున్నది. అట్లే మహాభారత యుద్ధములో నర్జునుఁడే జయించెను; అంతటి గొప్పవీరుల నాతఁడే జయించి స్వర్గమున కంపెనను కీర్తిమాత్రము నాకు లభించినది. రాజా ! నిజమునకు నా ప్రయోజకత్వ మేమికలదు?

విరాట్‌ నగరమున గోధన హరణ సమయమునకు మనము బయట పడితిమే అప్పటికి అజ్ఞాత వాసము గడువు తీరిపోయినది. దుర్యోధనుని హృదయము పాతకముతో నిండియుండెను. ఆతఁడేవిధమునైన మనలను రాజ్యభ్రష్టులఁజేయ వలెననియే. మన పై తృకరాజ్యమును మనకీయ నాతనికి లోపల యిష్టము లేదు. అందువలన నాతఁడనేక నెపములు పెట్ట మొదలిడెను. ఆతఁడిట్లన మొదలిడెను:- " అజ్ఞాత వాసము గడువు పూర్తి కాకమునుపే పాండవులు బయటపడిరి. కావున వీరు నియమాను సారముగ పండ్రెండు సంవత్సరములు వనవాసము, ఒక సంవత్సర మజ్ఞాతవాసము చేయవలయును." భీష్మపితా మహుఁడు లెక్కవేసి పాండవులు గడువునకు ముందు బయటకు రాలేదని నచ్చచెప్పెను. అదియునుగాక అజ్ఞాతవాసము సంవత్సరముకంటె చాల మిగిలినది. కాని యాతఁడెవరి మాటను వినక తాను బట్టిన కుందేటికి మూఁడే కాళ్లని మొండిపట్టు పట్టెను. చివరకు యుద్ధమే నిశ్చయ మయ్యెను. రెండు పక్షముల వారము సైన్యమును బ్రోవుచేయు చుంటిమి. దుర్యోధనుఁ డధికారారూఢుఁడు. మనము రాజ్యభ్రష్టులము. సాధన హీనులము. అయితే ధర్మాత్ములగు రాజులు శ్రీకృష్ణసహాయముచే మన పక్షమునఁ బోర సిద్ధపడిరి. మిగిలిన బలవంతులగు వీరులను సేనాసహితముగ తన వైపునకుఁ గలుపుకొనెను. ఈ విధముగ నాతని వైపు పదునొకండు అక్షౌహిణీ సేనయు, మన ప్రక్కన ఏడు అక్షౌహిణీ సేనయు నయ్యెను. కాని నారథమునకు సారథి గోపీజన వల్లభుఁడు బృందావనవిహారి యయ్యెను.నేనాతనితో నిట్లంటిని:- " వాసుదేవా! నారథమును రెండుసేనల మధ్యను నిలుపుము. నే నెవరెవరితోఁ బోరాడవలయునో చూచుకొనవలయును."

నా యాజ్ఞను బొందగానే యాతఁడు వెంటనే గుఱ్ఱపు కళ్లెములను లాగిపట్టి, నిమిషములో నా రథమును రెండుసేనల మధ్యను నిలువఁబెట్టెను. రెండు సముద్రములు కలిసికొనుటకు సిద్ధముగానున్నట్లు అపారముగనున్న రెండు సేనలు పోరాడుటకు సిద్ధమైనట్లు నేను తెలిసికొంటిని. నేను కౌరవవీరులను జూచు నప్పటికి నా ఉత్సాహము చప్పఁబడెను. భయమువలనఁగాదు, పిరికితనమువలనఁ గాదు. నాకు వారందఱు బంధువులను కృపణత కలిగెను. నే నెటు చూచినను నాకు అందఱును సంబంధులు , బంధువులుగఁ గన్పట్టిరి. అందఱకంటె ముందుగా నందఱకును సేనాపతియు, తెల్లని గడ్డమును, తెల్లని వేండ్రుకలును గలిగి సాక్షాత్తుగా వీరతామూర్తియై ప్రధానసైన్యాధిపతియగు భీష్మ పితామహుఁడు నిలువఁబడియుండెను. ఈతఁడు మనకు తాత. ఈతఁడు మనలను పుత్రులవలె ఁ బెంచెను. మనము దుమ్ముతో నిండిన వస్త్రములతో నిశ్శంకతో ఈతనివడిలోనికి బోవ, ఈతని స్వచ్ఛమగు వస్త్రములు మలినము లగుచున్నను మనమీఁదఁగోపపడక ఎంతో ప్రేమతో మనలను ముద్దుపెట్టుకొనెను. ఈతఁడెంతో ప్రేమతో మనలను హృదయమునకు హత్తుకొనెడువాఁడు. అట్టిది నేఁడాతనితోఁబోరవలసివచ్చినది. ఈతనిఱొమ్ములో తీక్షబాణములు నాటవలసివచ్చెను. ఇది నావలనఁగాదనుకొంటిని. నేను రాజ్యము కొఱకిట్టి క్రూరకర్మను జేయఁజాలనంటిని.

ఈతని సమీపముననే వీరత్వమునకు, బ్రహ్మతేజమునకు సాకారమూర్తియై సన్నగానుండిన కఠోర పూజనీయబ్రాహ్మణుఁడు నిలువఁబడియుండెను. ఈతఁడే నా గురుదేవుఁడగు ద్రోణుఁడు. ఈయాచార్య చరణానుగ్రహముననే మనము సమస్త శస్త్రాస్త్రములను సంపాదించితిమి. నన్ను బలవంతునిఁగఁ జేసినవాఁడును, త్రైలోక్య విజయునిఁగా నొనర్చినవాఁడీ గౌతమ నందనుఁడే. మనమీఁద నీతఁ డెంతో స్నేహముంచెడువాఁడు. ఈ సమదర్శయగు నాచార్యుఁడు నామీద నెంతో పక్షపాతము జూపెడు వాఁడు. మనము శ్రద్ధాంజలిపుష్పముల నీతని శ్రీచరణముమీఁద నుంచి మన మెఱుపు కిరీటములతో నీతనికి నమస్కరించినప్పుడు ఆతఁ డెంతో ప్రేమతో నిట్లనెడువాఁడు :- " వత్సా ! ఆయుష్మాన్భవ!" ఇట్టి గురుదేవునితోనా నేఁడు పోరాడుట ! మన బాణపు పోట్లచే నాతని శరీరము రక్తరంజిత మగుటను మనము చూడఁగలమా ? ఇట్టి పాపము నాచేతులతోఁ జేయఁజూలను.

సూతపుత్రుఁడగు కర్ణుఁడు క్రూరుఁడైనప్పటికి, ఎల్లప్పుడు మనకు ప్రతిస్పర్థి యైనప్పటికి, మనకు సహాధ్యాయి సోదరుఁడు. మనమందఱ మొకే యాచార్యుని శిష్యులము. రాజా ! అప్పటికి నాకు తెలియదు గాని ఆతఁడు సహాధ్యాయియే కాదు. మన కందఱకు అన్న. ఆ మహాభాగుఁడగు కర్ణుఁడు సూతపుత్రుఁడు కాఁడు. మీకంటె ఁ బెద్దవాఁడు. శ్రేష్ఠుఁడు. సమ్మాననీయుఁడగు ఆర్యబంధువు. నేనప్పటికి ఆతఁడొక యద్వితీయ ధనుర్ధరుఁడనియు, నాకు ప్రతిస్పర్థియనియు మాత్రమే యెఱుఁగుదును. ఆతనికి కలుగుచున్న కీర్త్యతిశయమునకు నేను భయపడుచున్నను ఆతనిఁ జంపవలెనని నాహృదయములో లేదు. ఇంతటి మహామహుఁడగు వీరుని ప్రాణమేల తీయవలెనని నాయభిప్రాయము.

ఇఁక నశ్వత్థామ. ఆతఁడు నాగురుపుత్రుఁడు. సోదరుని వంటివాఁడు. విద్యలోను, వర్ణములోను, వయస్సునందును, బల పరాక్రమమందును జ్యేష్ఠుఁడు. శ్రేష్ఠుఁడు. నాకు పూజ నీయుఁడు. సమ్మాననీయుఁడు. బ్రాహ్మణుఁడయ్యు నీతఁడస్త్రశస్త్రములతో యుద్ధముచేసిన నిలువలేము. ఒకవేళ నాతనిజంపి రాజ్యము పొందిన బ్రాహ్మణకర్త రంజితమగు నారాజ్యము భూత , ప్రేతముల కాహారమగును. ఆతని నెట్లు చంపఁగలను ? గురుపుత్రుని, మఱియు బ్రాహ్మణుని నేను జంపలేను. నేను చచ్చినను నాకిష్టమే.

మనమామ శల్యుఁడు నిలువఁబడి యున్నాఁడు. మన మీతనిని స్వంతమేనమామకంటె నెక్కుడుగఁ బ్రేమింతుము. ఈతఁడు మన నకులసహదేవుల తల్లియగు మాద్రికి అన్న. ఈతఁడు మద్రదేశమునుండి మనలను జూడ ననేకోపహారము లను గొనివచ్చునప్పుడు పరుగెత్తుకొనివెళ్లి అమ్మయగు కుంతికి మామ వచ్చుచున్నాఁడని చెప్పి మరల పరుగులిడి ద్వారమున నాతని కౌఁగిలించుకొనెడు వారము. అప్పుడాతఁడు మనల నందఱను ముద్దాడి, తెచ్చిన ఉపహారములను మనముందుంచి యిట్ల నెడువాఁడు:- ' అర్జునా ! నీకేవస్తువు యిష్టము నాయనా ! నీవు వీనిలో నేవస్తువులను గైకొందువో చెప్పుము.' నెనొకటి రెంటిని వెంటనే తీసుకొనెడు వాఁడను. ఆతఁడు నవ్వి, లాలిం,చి ముద్దిడు కొనును. అట్టివాఁడు నేను ప్రాణములు తీయుటకు అస్త్రశస్త్రములతో నిలుపఁబడెను. ఆతఁడు మేనల్లుండ్రను జంపఁడు. ఒకవేళ ఁ జంపినను నేనాతనిపై నస్త్రశస్త్రముల నెట్లు ప్రయోగింపఁగలను ?

ఇఁక దుర్యోధనుఁడున్నాఁడు. వీని ప్రకృతి క్రూరము. స్వభావము. నిందితము. కాని యేమిచేయుదము ? మనవ్రేలి ఉంగరము బిగిసి రాకున్న దానిని తెగగొట్టి తీయుదుము. కన్నులు చెడినను, క్రుళ్లినను వాటిని బెఱికి వేయుదుము. ఏమైనఁగానిండు ఈతఁడు మన పెదతండ్రి కొడుకు. వయస్సునఁ బెద్దవాఁడు. అనేక సారులు ఈతని పాదములనంటితిని. పైకియే కానిండు, శిష్టా చారము ననుసరించియే కానిండు ఈతఁడు నన్నుఁబ్రేమించెను. నేఁడీతఁడు చక్రవర్తి. పదునొకండు అక్షౌహిణీసేనకు అధిపతి ఈతనిఁజంపి ఈతఁడు భోగించి వదలిన ఉచ్ఛిష్ఠరాజ్యమును మనముపొందినచో దానివలన మనకుసుఖమేనా ? ఈతని రాణులు విధవలై ఉష్ణ నిశ్వాసములు విడిచిన మన హృదయముమీఁద బొబ్బలెక్కవా? ఈతఁడు చక్రవర్తి కాఁదలచిన కానిండు. ఇప్పుడు మనమెట్లు బిచ్చమెత్తుకొని జీవించుచుంటిమో యిప్పుడు నట్లే జీవింపవచ్చును. జీవిత మెన్నాళ్లు? ఈ క్షణభంగుర దేహమునకీ క్రూరకర్మ యేల చేయవలయును? ఒకరక్తమునఁ బుట్టిన సోదరులను వధించి కులహత్యను, కళంకమును నేనేల మోయవలెను?

ఈవిధముగ బంధువు లందఱును గాంచఁగానే నాకు మోహము కలిగెను. నేను గాండీవమును జారవిడిచితిని. అంబులను, అంబులపొదులను తీసిపాఱవైచి, నా సారథియగు శ్యామసుందరునితో నిట్లంటిని :- " వాసుదేవా ! నా రథమును హస్తినా పురమునకుఁ గొనిపొమ్ము."

చకితుఁడై యాతఁడిట్లనెను:- " ఏల? అక్కడైమైన మఱచిపోయితివా ? యుద్ధారంభమున నీకేమి జ్ఞాపకమునకువచ్చినది ?"

అన్యమనస్కుఁడనై నేనిట్లంటిని :- " నేను యుద్ధము చేయను."

గుడ్లురిమి, శుష్కమగు నవ్వు నవ్వుచు, నన్న వజ్ఞచేయుచు నాజగన్నాటక సూత్రధారుఁడిట్లనెను :- " భయపడితివా యేమి ? బడాయిలు కొట్టితివే ? ఇట్లైతివేమి?

నేను మిక్కిలి రోషముతో నిట్లంటిని :- " కృష్ణా ! నన్నెగతాళి చేయకుము. శివునితో యుద్ధమొమనర్చి మెప్పించిన అర్జునుఁడు మానవులకు భయపడునా ? నివాతకవచులను, హిరణ్యపురవాసులను, దేవతలకు కూడ నవధ్యులైన వారిని లీలగాఁజపింన యర్జునుఁడు మానవులకు భయపడునా ? భయ ముచేఁగాదు, దయచే నీబంధువులను జంపఁజాలకున్నాను."

కొంచెము వ్యంగ్య స్వరముతో శ్రీకృష్ణుఁ డిట్లనెను:- " అబ్బో! చాల దయగలవాఁడవు. దయచే నీవు పాండురాజును బ్రదికించలేదేమి ?"

నేనిట్లంటిని :- " అప్పటికి నేను పసివాఁడను. పెద్దవాఁడ నైనచో యమునిపెత్తన మేమి సాగును? మృత్యు వాసన్నమైనప్పు డెవరు రక్షింపఁగలరు?"

ఆతఁడిట్లనెను :- " అయితే నీవు మృత్యువునుండి రక్షింపఁజాలకున్న భయపడెద వేల ? వీరంద ఱల్లప్పుడు నివసించెదరా ? నీవు దయదలఁచి వదలిన వీ రజామరులై యుందురా ?"

నేను బలమును జూచుకొని యిట్లంటిని:- " మృత్యుసమయము వచ్చి చచ్చిన నది వేఱువిషయము. మనము వ్యర్థముగ జేతులార జంపనేల ? కాలవశులై వారు చచ్చిన మనకు పాపము రాదు".

అప్పుడాతఁడు పకపకనవ్వి యిట్లనెను :- " అర్జునా ! నీకు తెలియలేదు. నీ విన్నాళ్లు నాసహవాసము చేసియు నజ్ఞానివిగానే యుంటివి. నేనే కాలస్వరూపుఁడను. నేనే నేఁడు సమస్తలోకమును సంహారముచేయఁ గూర్చుంటిని. నేనే నిన్ను నిమిత్తమాత్రునిఁగఁ జేసి సంహారము చేయఁబోవుచున్నాను. భీష్మ, ద్రాణాదుల నెదుర్కొను శక్తి నీకేది ? నీ రథముపై గూర్చిండి అందఱను నిస్తేజులను, మృతప్రాయుల నొనర్చెదను. నీవు యుద్ధము చేయకున్నను వీరు చావఁగలరు.నేనే నీమూలమున వీరికి మృత్యువు వ్రాసిపెట్టితిని. నీ వహంకారమున యుద్ధభూమి వదలిపోయిన నా ప్రకృతి నిన్ను లబాత్కారముగ యుద్ధమునకు లాఁగఁగలదు. వీరందఱు చచ్చిరి. కేవలము నీకు ప్రతిష్ఠ కలుగఁజేయుటకై చచ్చినవారిని మరల నీచేఁ జంపించుచున్నాను. కావున వీరా ! పిఱికితనమును వీడి నేను చెప్పినట్లు యుద్ధము చేయుము".

అప్పుడు నాకిష్టము లేకున్నను యుద్ధము చేసితిని. ఆతని తర్కమునకుఁ దలవంచితిని. ఆతని జ్ఞానపతాకముకడ వివశుఁడనై తలవంచితిని. రాజా ! ఆతఁడు నా రథమును నడుపుచుండిన రెండు కాలచక్రములను నడుపుచున్నట్లుండెను. పిడుగు పడిన తప్పక చచ్చినట్లు ఆతని దృష్టిపడిన నాతఁడు హతవీర్యుఁడై మృతునివలె నగును.

కౌరవయోధు లందఱు బలముకొలఁది నాపై ప్రహార ములు కావించిరి. ఆ యస్త్రశస్త్రములన్నియు నమోఘములు. వ్యర్థముకానివి. కాని కృష్ణకృపచే నవి నన్నుఁ దాఁకలేదు. నా దగ్గఱకువచ్చి వ్యర్థమైపోయెడివి. మహారథులందఱును నామీఁద బాణవర్షములు కురిపించిరి. కాని గోవర్థనధారణ సమయమున నింద్రుని వర్షమట్లు అన్నియు వ్యర్థము లయ్యెడివి. నృసింహ దేవుఁడు తనగోళ్లతో హిరణ్యకశిపుని జీల్చెను. కాని యీతఁడు తన దృక్కులచే నందఱ హృదయములను జీల్చెను. అందఱు హృదయహీనులు, బలహీనులు, క్షీణాయుస్కులైరి. హిరణ్యకశిపుఁడు ప్రహ్లాదుని జంపుటకు విషముతినిపించెను. సముద్రమునఁ బడవేసెను. కొండలనుండి దొరలించెను. అగ్నిలోఁ బడవేసంను. పాములఁ గఱపించెను. ఎన్ని యాతనలు పెట్టినను ఆతనికి బాధ కలుగనట్లు భీష్మ, ద్రోణ, కర్ణ, శల్యాది సేనపతులు దుర్యోధనుని సంతోష పెట్టుట కనేకములగు నోఘాస్త్రములఁ బ్రయోగించిరి. కాని ఆతని దయచే నన్నియు వ్యర్థము లయ్యెను. నన్నేమియు ఁ జేయలేకపోయెను. అట్లు నారథము మీఁదఁ గూర్చిండి నన్ను సదా రక్షించుచు , శత్రువుల తేజోబలములను హరించుచు, నన్ను బాణములనుండి రక్షించుచుండిన శ్యామ సుందరుఁడు నన్ను , నట్టనడిసముద్రములోఁబడి కొట్టుకొనుచుండ వదలిపోయెను. నాముందే అదృశ్యుఁడయ్యెను. ఆతఁడు లేక నీ ప్రపంచమంతయు శూన్యముగఁ దోఁచుచున్నది. రాజా ! ఇప్పుడీ ప్రపంచము సారహీనమగు బియ్యములేని తాలువలె నైనది. ఇప్పుడు మనలను దలఁచుకొనువాఁడు లేఁడు." అర్జునుఁడిట్లనుచు వికలుఁడయ్యెను.

ఛప్పయ

శత్రు పక్షకే అస్త్ర పరసి పావైఁ నహి ఁ తోకూఁ |

బార బార యోఁ కహేఁ ఫిరైఁ రణ మహఁలై సోకూఁ||

దరసావేఁ నిజ కలా వివిధ విధి రత కూఁ హాఁకై |

తజైఁతేజ బలవీర,జాహి తిరఛై హ్వై తాకైఁ ||

రాజ9 ! రణమేఁ కాల బని, సంహారే సబ హీ జనే|

అవని త్యాగి అబ అఖిల పతి, వర వికుంఠ వాసీ బనే||

అర్థము

శత్రుపక్షములోని అస్త్రములు వచ్చినను తగులకుండఁ జేసెను. రణమునుండి మరలవలదని మాటిమాటికి ఉత్సాహమును గలిగించు చుండెను. రథమును నడుపుటలో తన కళ నందఱకుఁ జూపించుచు నడుపుచుండెను. ఆతని దృష్టి యెవనిపైఁ బడుచున్నదో వారు తేజో బల వీర్యములను బోఁగొట్టుకొను చుండిరి.

రాజా ! రణములో కాలస్వరూపుఁడై అందఱను జంపించెను. అట్టివాఁడిప్పు డీ భూవనమును వదలి వైకుంఠమునకుఁ బోయెను.

BHAGAVATA KADHA-3    Chapters